మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడు. మెగా కాపౌండ్ లో చిరంజీవి గారి లెగసీని తన నటనలోనూ, నృత్యాలలోనూ కొనసాగిస్తున్నాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తండ్రి నుంచి ఒద్దికను, బాబాయ్ పవన్ కళ్యాణ్ నుంచి తెగింపు ను అలవరచుకున్నాడు అని అందరూ చెప్పే మాట. సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా రామ్ చరణ్ తన అభిమానులను దగ్గరగా ఉంటారు. ఆయనను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే..
తన సినిమాలకి,వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను చరణ్ సోషల్ మీడియా తన అభిమానాలుతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటి విషయాన్నే చరణ్ తన ఇన్స్ట ఖాతాలో పోస్ట్ చేశారు. సైడ్ యాంగిల్ నుంచి కోర మీసం, చుర కత్తుల లాంటి చూపుతో ఉన్న తన ఫోటోను షేర్ చేసి దానికి ఎప్పుడు మీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి అనే కాప్షన్ ను జత చేశారు. ఈ లుక్ తను తాజాగా రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న RRR లోది అని చెప్పకనే చెబుతోంది. చరణ్ లుక్ కి ఫాన్స్ ఫిదా అయిపోయి ఆ ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు. మొత్తానికి చరణ్ తన అభిమానులకు నుంచి మంచి కిక్ ఇచ్చే ఫోటోతో పాటు వృత్తి పట్ల అంకిత భావం గురించి మంచి కొటేషన్ కూడా ఇచ్చారు అని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.