RC15 Crazy Update: RRR బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయిన మెగా పవర్ స్టార్ రామ్. ప్రెసెంట్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మరో భారీ చిత్రంలో నటిస్తున్నారు. దీన్ని RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తోండగా.. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే గత కొన్నిరోజులుగా రామ్ చరణ్ పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఓవైపు అంతర్జాతీయ వేదికలపై రామ్ చరణ్ హవా కొనసాగుతుండగా, మరోవైపు RC15 ఫస్ట్ లుక్‌కు.. టైటిల్ అనౌన్స్మెంట్‌కు డేట్ ఫిక్స్ అయింది. చరణ్ బర్త్‌డే రోజే ఈ ఈగర్‌కు తెర పడనుంది.
దీనికి కౌంట్‌డౌన్ కూడా షురూ చేశారు మెగా ఫ్యాన్స్. ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియన్ హిట్ ట్రిపుల్ తరువాత.. అసలేమాత్రం గ్యాప్ తీసుకోని రామ్ చరణ్.. నేరుగా శంకర్ డైరెక్షన్లో.. RC15 షూట్లో జాయిన్ అయ్యాడు. ఆ సినిమా షూటింగ్‌ను పరిగెత్తిస్తూనే.. ఆ తరువాత న ఫిల్మ్ లైనప్ మీద కూడా ఫోకస్ పెట్టేశాడు. వచ్చే పదేళ్ళలో చరణ్ మూవీస్ అన్నీ నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయి.