Ram Charan: RRR బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయిన మెగా పవర్ స్టార్ రామ్. ప్రెసెంట్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మరో భారీ చిత్రంలో నటిస్తున్నారు. దీన్ని RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు న్యూజీలాండ్‌లోనూ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది.
నిన్న హైదరాబాద్ చార్మినార్ దగ్గర కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టిన దర్శకుడు శంకర్.. ఈరోజు తన షూటింగ్ ను కర్నూలుకి షిప్ట్ చేశాడు. ఈ రోజు రాయలసీమలో ప్రసిద్దిగాంచిన కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర RC15 మూవీ షూటింగ్ ప్రారంభించారు. అయితే అక్కడకు భారీ సంఖ్యలో అభిమానులు షూటింగ్ స్పాట్ చేసుకున్నారు.
Also Read: త్వరలో మేం ముగ్గురం కాబోతున్నాం
దీంతో పోలీసులు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే ముందు నుంచే ఈ సినిమాలో లీకులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు షూట్ తాలూకు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణ సంస్థ తరఫున ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు డిలీట్ చేస్తున్నా ఏదో రూపంలో ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి.
అభ్యుదయం పార్టీ తరఫున శ్రీకాంత్ రామ్ చరణ్ తదితరులు పాల్గొన్న సీన్లు పరస్పరం బురుజు ఎత్తు పైనుంచి కౌగిలించుకునే విజువల్స్ అన్నీ ఫ్యాన్స్ కెమెరాలో బంధించారు. దీంతో RC15 లీకుడ్ పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో తండ్రి కొడుకులుగా కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తోండగా.. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.