Ram Charan RRR – రామ్ చరణ్ పై జేమ్స్ కామెరూన్ ప్రశంసలు…గర్వంగా ఉందన్న మెగాస్టార్…
దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కించిన చిత్రం “RRR”. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.
ఇక ప్రపంచ సినిమాకి ఇచ్చే అత్యుత్తమ అవార్డు “ఆస్కార్” కి కూడా RRR లోని “నాటు. నాటు” సాంగ్ ఎంపికై.. అడుగుదూరంలో నిలిచి.. భారతదేశ సినిమారంగాన్ని ఆసేతు హిమాచలం అంత ఎత్తు నిలిపిన సినిమా RRR.
ఇందులోని తారక్, రామ్ చరణ్ నటనకి సినీ ప్రముఖులు అందరూ ప్రశంసలు కూడా కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అవతార్ టైటానిక్ వంటి మేటి సినిమాలు తీసిన హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ RRR లోని రామ్ చరణ్ నటనని ని పొగడ్తలతో ముంచెత్తాడు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ తండ్రి.. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ “మీలాంటి గ్లోబల్ ఐకాన్, సినిమాటిక్ జీనియస్ నుండి ప్రశంసలు అందుకోవడం ఆస్కార్ అవార్డు కంటే తక్కువేం కాదు..ఇది రామ్ చరణ్ కి గొప్ప గౌరవంగా భావిస్తున్నా.. చరణ్ సినీ ప్రయాణంపై తండ్రిగా నేను గర్వపడుతున్నా.. మీ అభినందనలు చరణ్ భవిష్యత్ కి ఆశీర్వాదం” అని అన్నారు