Ram Charan Shankar Movie Update : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాతో చరణ్ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. రాంచరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఆర్‌సీ 15 (RC15). తాజాగా ఆర్‌సీ 15 షూటింగ్‌కు సంబంధించిన కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది.
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం మేకర్స్ రేపు హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ పాటను షూట్ చేయబోతున్నారన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. అంతేకాదు డైరెక్టర్ శంకర్ టీం మిగిలిన షూటింగ్ పార్టును రాజమండ్రి, వైజాగ్ తదితర ప్రాంతాల్లో షూట్ చేయబోతుందట. ఇదివరకు కూడా ఏపీలోని రాజమండ్రి, వైజాగ్ లలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. పాటలను చిత్రీకరించడంలో దర్శకుడు శంకర్ కి సెపరేట్ స్టైల్ ఉంది.
ఆయన సినిమాల్లోని పాటలు చాలా రిచ్ గా ఉంటాయి. రామ్ చరణ్ కోసం కూడా అలాంటి సాంగ్స్ ప్లాన్ చేశారట. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా కనిపించనున్నారు. ప్రెజంట్ లో అయితే ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారు. తండ్రీ కొడుకులుగా రెండు క్యారెక్టర్లు ఉంటాయని టాక్. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించనుంది.