Ram Charan : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘RRR’ మూవీ ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది. వసూళ్ల పరంగానే కాకుండా, ప్రతిష్టాత్మక అవార్డుల పరంగానూ దుమ్మురేపుతోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ సహా పలు అవార్డులను దక్కించుకున్న ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల కోసం ఎదురు చూస్తోంది.
ఒక్క తెలుగు భాషలోనే కాకుండా ప్రపంచ భాషల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సినిమా “ఆర్ఆర్ఆర్”. దక్షిణాది చిత్రాల ఖ్యాతిని ఖండాంతరాలు ఇనుమడింపజేసిన సినిమా ఆర్ఆర్ఆర్. ఇక ఈ మూవీ నుండి కీరవాణి కంపోజ్ చేసిన నాటు నాటు సాంగ్ ఏకంగా ఆస్కార్ నామినేషన్స్ బరిలో నిలిచింది.
తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దర్శనమిచ్చిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మార్చి 12న జరుగనున్న ఆస్కార్ అవార్డుల ఈవెంట్ కోసం రామ్ చరణ్ యుఎస్ఏ బయల్దేరి వెళ్లారు. త్వరలో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి కూడా USA వెళ్లనున్నట్టు సమాచారం.
After receiving immense love from his large USA fan base during the #Goldenglobes2023, 'Mega Powerstar' @AlwaysRamCharan was spotted taking off for the #Oscars today 🤩💥
Fingers crossed for #RRR 🔥🌊#Ramcharan #Oscars2023 pic.twitter.com/8geEn0Op0P
— Ramesh Bala (@rameshlaus) February 21, 2023