Ram Charan’s Missed Kalki Movie : పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న ప్రభాస్ నెక్స్ట్ మూవీ కల్కి గురించి, అతని ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియన్స్ అందరూ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియోలకి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చేసింది. శ్రీమహావిష్ణువు 11వ అవతారం కల్కి 2898వ సంవత్సరంలో భూమి మీద అవతరిస్తాడని ఇప్పటికే ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.
దాన్ని బేసిగ్గా తీసుకొని డైరెక్టర్ నాగఅశ్విన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే కథలో కాస్త మార్పులు, చేర్పులు చేసి ప్రస్తుత కాలంలోకి 2898 సంవత్సరంలో కాకుండా ముందుగానే కల్కి అవతారం భూమిపై ఉంటే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అసలు కల్కిని ఎందుకు భూమి మీదికి రప్పించారు. సైంటిస్టుల పాత్ర ఏమిటి.
సైంటిస్టులు కల్కిని భూమి మీదకి రప్పించడానికి ఆ ప్రాజెక్టు పెట్టిన పేరే ప్రాజెక్టు కె అని ఈ సినిమా స్టోరీ లైన్ కూడా అదే అని తెలుస్తుంది. ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ కమలహాసన్ విలన్ పాత్రలో నటిస్తుండడం విశేషం. ఇక హీరోయిన్ గా దీపికా పదుకొనే అలాగే ముఖ్య పాత్రలలో అమితాబచ్చన్, దుల్కర్ సల్మాన్, దిశా పటాని యాక్ట్ చేస్తున్నారు.

ఇంత భారీ బడ్జెట్ తో, ఇంతమంది ప్రముఖ యాక్టర్స్ తో రూపొందుతున్న ఈ సినిమాని ఫస్ట్ ఒక హీరో రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. మరి ఆ రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసుకుందాం..నాగ ఆస్విన్ ఈ సినిమాని మొదటిగా ప్రభాస్ కి కాకుండా రామ్ చరణ్ ని మైండ్ లో పెట్టుకొని ఆలోచించుకున్నాడు అంట, ఆరు సంవత్సరాల క్రితం రామ్ చరణ్ కి ఈ
స్టోరీని కూడా వినిపించాడంట, కానీ మొదటి సినిమాతోనే అంత పెద్ద భారీ బడ్జెట్ ని ఎందుకు తల మీద వేసుకుంటావు అని రామ్ చరణ్ స్మూత్ గా చెప్పడంతో, నాగ ఆశ్వీన్ తర్వాత మహానటి సినిమాను తెరకెక్కించి గ్రాండ్ సక్సెస్ ని అందుకున్నారు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో రామ్ చరణ్ కి కాకుండా హీరో ప్రభాస్ కి ఈ కథను వినిపించాడంట నాగశ్విన్. ఇక ఒక లైన్లోనే ఒక సెట్టింగ్ లోనే ప్రభాస్ ఓకే చెప్పేసాడు అంట, ఆలస్యం చేయకుండా వెంటనే
షూటింగ్ ని ప్రారంభించి, మహానట దిగ్గజాలను ఈ సినిమాలో నటించేలాగా అందరిని ఒప్పించి, సినిమా పైన వేరే లెవల్ లో హోప్స్ ని క్రియేట్ చేశాడు నాగఅస్విన్. కానీ రామ్ చరణ్ చేతులారా ఈ సినిమాని పోడగొట్టుకోవడంతో అభిమానులందరూ ఉసూరుమంటూన్నారు. అయ్యో రామ్ చరణ్ అలా చేసి ఉండాల్సింది కాదే అంటూ, ఈ న్యూస్ వైరల్ అవుతున్న కొద్దీ ఎవరికి తోచిన అభిప్రాయాలను వారు కామెంట్ రూపంలో పెడుతున్నారు.
