Rangasthalam Re Release in Japan : ప్రెసెంట్ తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోల బర్త్ డే సందర్భంగా పాత సినిమాలను 4K లో రిలీజ్ చేస్తున్నారు. వీటికి అభిమానుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన రీ రిలీజ్ ఇప్పుడు విదేశాలకు కూడా విస్తరించేసునుంది. దీనికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీతో శ్రీకారం చుట్టనున్నారు.
జపాన్ లో RRR మూవీ సక్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. 100 డేస్ కంప్లీట్ చేసుకోవడంతో పాటు మంచి వసూళ్లను రాబట్టింది. దీంతో అక్కడ రంగస్థలం రీ రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. జపాన్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన స్పేస్ బాక్స్ రంగస్థలం మూవీని స్క్రీనింగ్ చేస్తున్నట్లుగా పేర్కొనడంతో
పాటు టైమ్ తో సహా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ నెల 9, 10, 11వ తేదీల్లో ఈ సినిమాను స్క్రీనింగ్ చేయనున్నట్టు తెలిపింది. రంగస్థలం మూవీ రామ్ చరణ్ కెరీర్ లో ఓ మైలురాయి వంటిది. ఈ మూవీతో రామ్ చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక్కడ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన రంగస్థలం జపాన్ లో ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి..
'Rangasthalam (Telugu/ English subs)' @ Kobe
『Rangasthalam(テルグ語/ 英語字幕/ 日本語字幕なし)』を神戸にて上映します🎬📅Sunday, 9th April
🎦 Cine Libre Kobe (Hyogo)
⏰2:50PM~
🎟 Book tickets チケットご予約
(借館上映のため弊社サイトにて予約を受付)https://t.co/8jh2F11pT8 pic.twitter.com/NInqu5kHCz— SPACEBOX (@spaceboxmovie) April 4, 2023