Rana Daggubati as Support for Hanuman Movie : తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్న హనుమాన్ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ హోప్స్ ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కి ముందే చాలా సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతున్న తేదీనే హనుమాన్ సినిమా కూడా రిలీజ్ అవడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ సినిమాను యువ దర్శకుడు అయినటువంటి ప్రశాంత్ వర్మ నిర్మించారు.
దీనికి సంబంధించి ముంబైలో బాలీవుడ్ మీడియాకు ఈ సినిమాను ట్రైలర్ ను ప్రదర్శిస్తున్న ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా రానా దగ్గుపాటి హాజరయి సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా ట్రైలర్ కు రానా దగ్గుబాటి రావడంతో ఈ సినిమా పైన అంచనాలు భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి.
రానా గురించి తేజ సజ్జా మాట్లాడుతూ.. రానా గారికి నేను ఒక కాల్ చేశాను. ఆయన ఈవెంట్ కి వచ్చారు. నిజంగా గ్రేట్ స్టార్. ఈ సినిమాకు రానా దగ్గుబాటి లాంటివారు సపోర్ట్ దొరకడం నిజంగా నా అదృష్టంగా చెప్తున్నాను. అని రానాను పొగడ్తలతో ముంచెత్తాడు తేజ. ఈ సినిమా జనవరి 12న వెండితెర మీదకు రానుంది. అమృత అయ్యార్ తేజకు జోడిగా ఈ సినిమాలో నటిస్తుండగా, ముఖ్యపాత్రలుగా
వరలక్ష్మి శరత్ కుమార్ వినయ్ రాయ్ లాంటివాళ్ళు నటిస్తున్నారు.అనుదీప్ దేవ్, హరి గౌడ, జై క్రిష్, కృష్ణ సౌరబ్ ఈ సినిమాకు సౌండ్‌ట్రాక్‌లు అందించారు. నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై హనుమాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.