Rana Naidu Trailer : ట్రైలర్ అదిరిందిగా..!!
బాబాయ్ విక్టరీ వెంకటేష్ అబ్బాయి రానా కలిసి తొలిసారి కలిసి నటించిన వెబ్ సిరీస్ “రానా నాయుడు”. గతంలో రానా హీరో గా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో వెంకీ నటించినప్పటికీ.. అది కేవలం ఒక పాటకే పరిమితం అయింది..
పూర్తిగా కలిసి నటించిన వెబ్ సిరీస్ మాత్రం ఇదే..
అయితే ఈ వెబ్ సిరీస్ కి సంభందించిన ట్రైలర్ నేడు మేకర్స్ విడుదల చేశారు. కాగా ట్రైలర్ కి మంచి స్పందన వస్తుంది. అయితే ఈ ట్రైలర్ బట్టి ఇందులో మాఫియా నేపథ్యంలో జరిగే తండ్రి కొడుకుల మధ్య ఆధిపత్య పోరుగా..ఎమోషనల్ రివేంజ్ డ్రామాగా రూపు దిద్దుకొంది అని అర్ధం అవుతుంది.
నెట్ ఫ్లిక్స్ ఇండియాలో స్ట్రీమింగ్ కాబోయే ఈ వెబ్ సిరీస్ వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకి రానుంది. తొలిసారి బాబాయ్ అబ్బాయ్ కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ పట్ల ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది… ఇపుడు ఆ ట్రైలర్ ని మీరూ ఓ లుక్ వేయండి..
Rana Naidu Trailer :