Rashmika Hit the Star Hero : రష్మిక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్ గా దూసుకుపోయిన విషయం తెలిసిందే. ఈ అందాల భామ మొదటగా కన్నడ సినిమాలలో నటించి, ఆ తర్వాత తెలుగు చిత్ర సినిమాలో అడుగుపెట్టింది. తర్వాత విజయ్ దేవరకొండ తో నటించి ఒక్కసారిగా కుర్రకారు మనసుల్ని దోచేసింది. రష్మికకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. పుష్ప సినిమా తర్వాత ఆ ఫాలోయింగ్ కాస్త రెట్టింపు అయింది.
రష్మీక ఎంచుకునే పాత్రలు కూడా చాలా బాగుంటాయి. పుష్ప సినిమా తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్ లో యానిమాల్ మూవీలో నటించింది. రష్మిక నటనకు బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. రష్మిక బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది. యానిమల్ మూవీ 1000కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోయింది.
ఎవరు ఊహించని విధంగా ఆ సినిమా చాలా మంచి సక్సెస్ ని అందుకుంది. రష్మిక సినీ ప్రయాణంలో యానిమల్ మూవీ మర్చిపోలేని ఒక మంచి సినిమాగా మిగిలిపోతుంది. ఇక ఆ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. రష్మిక ఆ సినిమాలో ఒక చెంప దెబ్బ సీన్ కోసం 20 టేకులు తీసుకుందట. ఈ విషయాన్ని సందీప్ రెడ్డివంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
రణబీర్ కపూర్ ని కొట్టే సన్నివేశంలో ఏకంగా 20 టేకులు రష్మిక తీసుకుంది అని వివరించారు. ఈ విషయం బయటకు రావడంతో ఇక ఎవరికి తోచినట్టు వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. అది కూడా చెంపదెబ్బ కొట్టే విషయంలో అన్ని టెక్స్ తీసుకోవడం ఏంటి..! ఇది రష్మికకు అవమానకరమే, కొట్టే విషయంలో రన్బీర్ కపూర్ కూడా అన్ని సార్లు ఆ నొప్పిని భరించారంటే అది రణబీర్ కపూర్ కూడా అవమానకరంగానే అని ఎవరికి తోచినట్టుగా వారు కామెంట్స్ చేస్తున్నారు.