RC16 Update : RRR మూవీ అనంతరం గ్లోబర్ స్టార్ అయ్యాడు రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ పూర్తయిన వెంటనే స్టార్ డైరెక్టర్ శంకర్ తో RC15 షూటింగ్ లో బిజీ అయిపోయాడు చరణ్. చరణ్ ఈ ప్రాజెక్ట్ తర్వాత ఏ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ, చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో కలిసి పనిచేయడానికి సిద్ధం అయ్యాడు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బుచ్చిబాబు మొదటి సినిమాతోనే 100కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. అయితే చరణ్ RC 16 గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన ఇండియా టుడే Conclave లో RC 16 లో తన పాత్ర రంగస్థలంలో చిట్టిబాబు కంటే పవర్ఫుల్ గా ఉంటుందని వెల్లడించాడు.
రంగస్థలం చరణ్ కెరీర్ బెస్ట్ మూవీల్లో ఒకటి. ఇంకా చెప్పాలి అంటే చరణ్ లోని అసలైన నటుడిని బయటకు తీసిన మూవీ. ఇప్పుడు చెర్రీ అంతకు మించి RC 16 ఉంటుంది అనడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ మూవీ షూట్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం అవుతుందని, విదేశీయులు కూడా ఈ పాత్రను ఇష్టపడతారని చరణ్ అభిప్రాయ పడ్డాడు. చూడాలి బుచ్చిబాబు RC16 గురువు సుకుమార్ రంగస్థలం రికార్డులను బద్దలు కొడుతుందో లేదో..
