RC16 Update : RRR మూవీ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) గ్లోబర్ స్టార్ అయ్యాడు. ట్రిపుల్ ఆర్ పూర్తయిన వెంటనే స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ (Game Changer) షూటింగ్ లో బిజీ అయిపోయాడు. చరణ్ ఈ ప్రాజెక్ట్ తర్వాత ఏ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ, చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో కలిసి పనిచేయడానికి సిద్ధం అయ్యాడు. మొదటి సినిమాతోనే 100కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే.
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఇటీవల చరణ్ RC16 గురించి చరణ్ మాట్లాడుతూ రంగస్థలానికి మించి ఉంటుంది అనడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా అని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ హాలీవుడ్ వర్షన్ కూడా ప్లానింగ్ లో ఉందట.
ఆర్.ఆర్.ఆర్ తో హాలీవుడ్ లో చరణ్ కి మంచి క్రేజ్ ఏర్పడింది.
ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ చరణ్ యాక్టింగ్ ని తెగ మెచ్చుకున్నారు. చరణ్ తో బుచ్చిబాబు చేస్తున్న సినిమాను ఇంగ్లీష్ వర్షన్ కూడా రెడీ చేసి ఇంటర్నేషనల్ లెవెల్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అదే జరిగితే మాత్రం RRR తర్వాత చరణ్ కి ఈ సినిమాతో ఇంటర్నేషనల్ రేంజ్ లో సత్తా చాటే ఛాన్స్ ఉంటుంది. RRR నాటు నాటు సాంగ్ కే ఆస్కార్ రాగా చరణ్ తన 16వ సినిమాతో ఈసారి సినిమాకు గానీ, తనకు గానీ బెస్ట్ అవార్డ్ వచ్చేలా కృషి చేస్తున్నారని తెలిసిందే.