Rocking rakesh jordar sujatha Marriage: ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. బుల్లితెర, వెండితెర స్టార్స్ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ప్రేమించిన వారి మెడలో మూడుముళ్లు వేసి కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఆ కోవలోకే మరో కొత్త జంట చేరింది. బుల్లితెరపై కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాకింగ్ రాకేష్.
ఇటీవల ‘జబర్దస్త్’ షోలో తనతో పాటు స్కిట్స్ చేస్తున్న జోర్ధార్ సుజాతతో ప్రేమలో ఉన్నట్లు రాకేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాలను ఒప్పించిన ఈ జంట ఇక ఇటీవల పెళ్లి చేసుకోబోతున్నామంటూ ప్రకటించింది. జనవరిలో గ్రాండ్ గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.
తాజాగా తిరుమల తిరుపతిలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో సుజాతతో ఏడడుగులూ వేశాడు రాకేష్. వీరి వివాహానికి యాంకర్ రవి, గెటప్ శీను, ఏపీ మంత్రి రోజా కుటుంబంతో కలిసి హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.