RRR Movie Oscar : RRR మూవీని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో మూవీ లవర్స్ ఆనందానికి అవధులు లేవు. దేశం మొత్తం డైరెక్టర్ రాజమౌళిని ఆకాశానికెత్తేస్తున్నారు. ప్రపంచం మొత్తం మన టాలీవుడ్ వైపు చూసేలా చేశారు జక్కన. నిన్నటి నుంచి RRR టీంను ప్రధాని నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

నాటు నాటు పాటను చంద్రబోస్ రచించగా కీరవాణి స్వరపరిచారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీకి చరణ్, ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్పులేశారు. విశ్వ వేదికపై నాటు నాటుకి ఆస్కార్ లభించడంతో దేశం మొత్తం గర్వించింది. నిన్న ఎవరి నోట విన్న నాటు నాటు పాటే మార్మోగిపోయింది.
ఇదిలావుండగా ఆస్కార్ గెలిచిన RRR టీమ్‌ను సత్కరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందట. ఈ ఈవెంట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. ప్రస్తుతానికి RRR టీం US లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో టీం హైదరాబాద్ కు తిరిగి రానుంది.
