RRR Movie Team : కొన్నికోట్ల మంది భారతీయుల కల నిజం చేసి విశ్వవేదికపై తెలుగువాడి సత్తా చాటారు RRR టీం. ముఖ్యంగా జక్కన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆస్కార్ అవార్డు సాధించిన అనంతరం RRR టీం తిరిగి హైదరాబాద్ కు చేరుకుంది. శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్ లోని విమానాశ్రయానికి చేరుకున్న రాజమౌళి ఆయన సతీమణి రమ, కీరవాణి

ఆయన సతీమణి వల్లి, కార్తికేయ, కాలభైరవ, శ్రీసింహా, తదితరులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాజమౌళి, కీరవాణితో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో ఎయిర్పోర్ట్ ప్రాంగణమంతా రద్దీగా మారింది. మరోవైపు మీడియాతో మాట్లాడేందుకు ఆసక్తికనబరచలేదు. జైహింద్ అంటూ రాజమౌళి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ రోజు రామ్ చరణ్ కూడా హైదరాబాద్ కు రానున్నాడు. అయితే ఈవెనింగ్ వరకు చెర్రీ ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం హైదరాబాద్ కు విచ్చేయనున్నాడు. చరణ్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు మెగా అభిమానులు ప్లాన్ చేస్తున్నారు.
