RRR Team Oscar Entry Pass : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి, మరెన్నో అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా ప్రతిష్టాత్మక ఆస్కార్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆస్కార్ వేడుకలకు కీరవాణి, రాజమౌళి, చంద్రబోస్, కార్తికేయ ఎన్టీఆర్ రామ్ చరణ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ వెళ్లి అక్కడ సందడి చేసి అంతర్జాతీయ మీడియాను ఆకర్షించిన విషయం తెలిసిందే.
అయితే ఆస్కార్ అవార్డు వేడుకల్లో పాల్గొనడానికి RRR టీం మొత్తానికి ఫ్రీ ఎంట్రీ పాస్ దొరకలేదని, ఎంట్రీ పాస్ కోసం వీరు భారీగా ఖర్చు చేశారని తెలుస్తోంది. ఆస్కార్ వేడుకల్లో పాల్గొనదానికి కేవలం కీరవాణి చంద్రబోస్ తో పాటు వీరి భార్యలకు మాత్రమే ఆస్కార్ ఫ్రీ ఎంట్రీ పాస్ లభించిందట. మిగతా వాళ్లంతా డబ్బు పెట్టి ఆస్కార్ ఎంట్రీ పాస్ కొనుగోలు చేశారని తెలుస్తుంది.
ఈ విషయం టీం మొత్తం హైదరాబాద్ వచ్చాక సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారింది. నేషనల్ మీడియా ఎకనామిక్ టైమ్స్ సమాచారం ప్రకారం.. కీరవాణి, చంద్రబోస్ దంపతులు మినహా మిగిలిన వారంతా ఒక్కో టికెట్ ధర 25 వేల అమెరికన్ డాలర్లు.. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఒక్కో టికెట్ కు ఏకంగా 20.6 లక్షలు పెట్టి కొనుగోలు చేశారట. ఇది తెలిసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు.