మెగా ఫ్యామిలీ అంటే సినిమాల తరువాత అందరికీ గుర్తుకు వచ్చేది సమాజ సేవ. మెగాస్టార్ చిరంజీవి గారి మొదలు ఆయన తరువాత ఆ కుటుంబం నుంచి వచ్చిన హీరోలు అందరూ తమ వంతుగా సమాజానికి సేవ చేస్తూనే ఉన్నారు. ప్రకృతి ఉపద్రవాలు సంభవించిన సమయాల్లోనూ, కష్టాల్లో ఉన్న తమ అభిమానులను ఆదుకొనే విషయంలోనూ మెగా ఫామిలి ఎప్పుడు ఒక అడుగు ముందు ఉంటుందనీ అందరూ అంటుంటారు.
అందులోను పవన్ కళ్యాణ్ గారు చేసే సేవా కార్యక్రమాలు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం గుర్తింపు అటు అభిమానుల్లోనూ, ఇటూ ప్రజల్లోనూ ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఇటీవలే ఆయన పుట్టిన రోజున ఆయన అభిమానులు తలపెట్టిన ఆక్సిజన సిలిండర్ల విరాళం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లాక్ డౌన్ సమయంలో సినీ కార్మికుల కోసం చేసిన సేవలు యావన్మంది ప్రశంసలను అందుకున్నాయి.
ఇప్పుడు మామయ్యల బాటలోనే మెగా మేనల్లుడు సాయి తేజ్ సమాజ సేవ చేస్తున్నాడు. విజయవాడలోని అమ్మ ఆదరణ ఓల్డెజ్ హోం సరైన ఆదరణకి నోచుకోవడం లేదని తెలిసి గతంలో ఆ ఓల్డెజ్ హోం బాధ్యత తాను తీసుకుంటాను అని సాయి తేజ్ ముందుకు వచ్చాడు. చెప్పిన విధంగా ఇప్పుడు వారికి తన సొంత ఖర్చులతో రెండు అంతస్థుల బిల్డింగ్ ను నిర్మించాడు. సాయి తేజ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో ఇప్పుడు అమ్మ ఆదరణ ఫౌండేషన్ తో పాటు చాలా మంది అతడిని రియల్ హీరోగా ప్రశంసిస్తున్నారు
