కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్ర షూటింగ్ నవంబర్ మొదటి నుంచి తిరిగి ప్రారంభం అవుతుందని తెలుస్తుంది.
ఆచార్య తర్వాత మెగాస్టార్ నటించబోయే తర్వాతి చిత్రం వేదాళం రీమేక్. తమిళంలో అజిత్ నటించగా సూపర్ హిట్ అయిన ఈ సినిమాకి తెలుగులో మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం లో చిరంజీవి చెల్లెలిగా సాయి పల్లవి ని ఖరారు చేశారని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో మరో కీలక రోల్ లో కమెడియన్ కం హీరో సునీల్ నటించనున్నారు. చిరంజీవి డబుల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు.