Sai Pallavi in Pushpa 2: పుష్ప 1ది రైస్ సెన్సేషనల్ హిట్ అవ్వడంతో పుష్ప 2 ది రూల్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రైజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా పుష్పలో బన్నీ తగ్గేదెలే మ్యానరిజంకు వరల్డ్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా పుష్ప 2 గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ట్రెండ్ అవుతుంది. ఈ మూవీలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటించనుందట. అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్ కాంబినేషన్ సీన్లలో ఓ గిరిజన యువతి క్యారెక్టర్ లో ఆమె నటించబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం సాయిపల్లవి 10 రోజుల కాల్షిట్స్ ఇచ్చారట. దీంతో బన్నీ ఫ్యాన్స్ సూపర్ కాంబినేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవలే వైజాగ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న పుష్ప టీం, ప్రస్తుతం హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ లో షూటింగ్ లో బిజీగా ఉంది పుష్ప టీం. ఈ షెడ్యూల్ లో ఫహద్ ఫాజిల్ పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. పుష్ప 1 రికార్డులను పుష్ప 2 బద్దలు కొడుతుందో లేదో.. మరోసారి పుష్ప రాజ్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాడో చూడాలి.
Discussion about this post