Sai Pallavi : ప్రెసెంట్ సౌత్ లో హీరో రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా కొత్త కొత్త కథలతో నటనతో, తన డాన్స్ తో అభిమానులను కట్టిపడేస్తుంది న్యాచురల్ బ్యూటీ. కేవలం స్క్రీన్ పై ఆమెను చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. ఇటీవల ఆమె నటించిన శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం చిత్రాల్లో సాయి పల్లవి నటన అద్భుతం.
ఈ చిత్రాలకు ఆమె ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సైతం అందుకుంది. గతేడాది సాయి పల్లవి ఇటీవల నటించిన చిత్రం గార్గి. ఈ మూవీకి కలెక్షన్స్ రాకపోయినా పల్లవి నటనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా ఈ సినిమాకు గానూ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ అందుకుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి నటనకు గానూ.. ఉత్తమ నటిగా ఈ అవార్డ్ కైవసం చేసుకుంది.
తాజాగా ఈ అవార్డ్ ప్రధానోత్సవాల కోసం ముంబై వెళ్లింది సాయి పల్లవి. ఈ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రెడ్ సారీ లో సాయి పల్లవి చాలా ఎలెగంట్ గా కనిపిస్తుంది. చాన్నాళ్ల తర్వాత సాయి పల్లవి కనిపించడంతో అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. ఇదిలావుండగా తాజాగా సాయి పల్లవి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఏం రాలేదు.
Our Queen @Sai_Pallavi92 today
at Mumbai 🥺🤍#SaiPallavi pic.twitter.com/D8DKRaRrOb— Sai Pallavi FC™ (@SaipallaviFC) March 27, 2023
Discussion about this post