Sai Pallavi: సాయిపల్లవి.. ఫిదా మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి తన నటనతో అందరినీ ఫిదా చేసింది. సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు. వీటికి దూరంగా ఉంటూ తన నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్న సహజ నటి సాయి పల్లవి. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ కూడా సాయి పల్లవే.

కేవలం స్క్రీన్ పై ఆమెను చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. సాయి పల్లవిని టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తారు. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం సాయి పల్లకి బ్యాడ్ టైం నడుస్తోంది. ఇటీవల ఈ నేచురల్ బ్యూటీ నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి.
Gallery: Ashu Reddy Hot Photos in Saree
భారీ అంచనాల మధ్య విడుదలైన విరాటపర్వం, గార్గి లాంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయినప్పటికీ.. కమర్షియల్‌గా నిర్మాతలకు మాత్రం నిరాశే మిగులుతోంది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది ఈ నేచురల్ బ్యూటీ.

అంతేకాదు మీడియాకు, సోషల్ మీడియాకు కూడా కాస్త దూరంగానే ఉంటుంది. దానికి కారణం ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ కావడమే. అయితే చాలా రోజుల తర్వాత ఇన్‌స్టాలో ఆమె ఫోటోని షేర్ చేసింది. జీవితంలో చిరునవ్వులు… ఆశ… కృతజ్ఞత ఉంటే చాలు అంటూ నవ్వులు చిందిస్తున్న ఫోటోని సాయి పల్లవి షేర్ చేసింది.
