Sai Pallavi: సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు. వీటికి దూరంగా ఉంటూ తన నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్న సహజ నటి సాయి పల్లవి. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫ్యాన్స్ ని కలిగి ఉన్న హీరోయిన్ కూడా సాయి పల్లవే. సాయి పల్లవిని టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అని కూడా ముద్దుగా పిలుస్తారు. అయితే సాయి పల్లవి తన అద్భుతమైన నటనకు మాత్రమే కాకుండా ఆమె డాన్స్ కి కూడా అభిమానులున్నారు.
ఇటీవల పల్లవి నటించిన విరాటపర్వం, గార్గి మంచి వసూళ్లు రాబట్టకపోయినా తన నటనకు మంచి గుర్తింపు లభించింది. ఎందుకో ఏంటో కానీ గత కొంతకాలంగా సాయి పల్లవి నుంచి ఏ మూవీ అప్డేట్ రాలేదు. ఈ క్రమంలో తాజాగా మరోసారి సాయి పల్లవి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం తాజాగా ఈ బ్యూటీ డిజిటల్ ఎంట్రీకి సిద్ధమయ్యినట్టు టాక్.
సాయి పల్లవి తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయబోతున్న ఓ వెబ్ సిరీస్‌లో సాయి పల్లవి నటించేందుకు ఓకే చెప్పిందట. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ నిజంగా సాయి పల్లవి సిల్వర్ స్క్రీన్ తో పాటు డిజిటల్ ఎంట్రీ ఇస్తుందా అనే ఆసక్తి నెలకొంది. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..