Salaar New Update: కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సలార్ అదే స్థాయిలో ఉంటుందని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో ఓ కీలకమైన జర్నలిస్ట్ పాత్రలో శృతి నటిస్తున్నట్టు సమాచారం.
ఇందులో ప్రభాస్ మరియు శృతిహాసన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో అద్భుతంగా వచ్చాయట. ఈ చిత్రం క్లైమాక్స్ లో శృతి హాసన్ చనిపోతుందని తెలుస్తుంది. ఇప్పటికే శృతి సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను పోస్ట్ చేసింది.
ఈ సినిమాలో శ్రుతి హాసన్ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఆమె తాజాగా ముగించుకున్నట్లుగా పోస్ట్ చేసింది. ఆమె దర్శకుడు ప్రశాంత్ నీల్, కెమెరా మ్యాన్ భువన్ గౌడతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సినిమాలో వర్క్ చేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆమె పేర్కొంది. హొంబాలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
https://www.instagram.com/p/CpAT6jbhh9X/?igshid=YmMyMTA2M2Y=