Salaar Part 1 Trailer : డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తో భారీ సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన డైరెక్షన్ లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీ రానుంది. దానికి సంబంధించిన ట్రైలర్ ని ఈరోజు మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మాత్రం మామూలుగా లేదు.
కే జి ఎఫ్ సినిమా ఎంత సంచలనాన్ని సృష్టించిందో మనకు తెలుసు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ మూవీని తెరకెక్కించడంతో ఈ సినిమా పైన భారీ ఎత్తున అంచనాలు క్రియేట్ అయ్యాయి. రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ ఈ సినిమాని రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్లు, పోస్టర్లు ఆ సినిమా పైన హోప్స్ ని క్రియేట్ చేశాయి. ఇప్పుడు తాజాగా సలార్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవి కేజీఎఫ్ మించిన యాక్షన్స్ సీన్స్ ఎంతో ఉండబోతుందని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది. టైలర్ మొత్తంగా మూడు నిమిషాల 47 సెకండ్లు ఉంది. సినిమా పైన ఇంకా భారీ అంచనాలు పెరిగిపోయాయని చెప్పవచ్చు. సలార్ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
అంతకంటే ఒక్కరోజు ముందు యుఎస్ లో అంటే డిసెంబర్ 21న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్, ముఖ్య తారాగనంగా మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమార్, జగపతిబాబు నటించారు. సినిమా ట్రైలర్ ని కూడా ఇస్తున్నాము మీరు చూసేయండి మరీ..