Salaar Release : బాహుబలి తర్వాత వరుసగా పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు రెబల్ స్టార్. ఈ క్రమంలో సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ మూవీస్ కు కమిట్ అయ్యాడు ప్రభాస్. కానీ ఈ టైములో ప్రభాస్ నుంచి మంచి మాస్ మూవీ వస్తే.. అది బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సలార్ అదే స్థాయిలో ఉంటుందని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు.
రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే గత కొంతకాలంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. మూవీని వరల్డ్ వైడ్ గా ఈఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
‘ది మోస్ట్ వయెలెంట్ మ్యాన్ వచ్చేస్తున్నాడు’ అని ట్వీట్ చేసింది. ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రమోషన్స్‌లో భాగంగా సలార్ పోస్టర్లు, గ్లింప్స్ వీడియో, టీజర్, ట్రైలర్.. ఇలా ఒక్కొక్కటిగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది ప్రభాస్ టీం. ఇక ఈ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కే తో పాటు, సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్, మారుతీ డైరెక్షన్ మరో మూవీ చేయనున్నాడు ప్రభాస్.
The Most Violent Man is coming soon with the full package to blow your mind on Sep 28th, 2023.
Hello @RCBTweets, let’s unleash the Rebel mode this year 🔥#Salaar #Prabhas #PrashanthNeel #VijayKiragandur#RCBxHombale @hombalefilms pic.twitter.com/ueQT3qC2aH
— Salaar (@SalaarTheSaga) April 5, 2023