Salaar Rights : రెబల్ స్టార్ ప్రభాస్ హిట్లూ, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. ప్రభాస్ చేతిలో ప్రెసెంట్ ప్రశాంత్ నీల్ సలార్, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K, సందీప్ వంగ స్పిరిట్ తో పాటు మారుతీ రాజా డీలాక్స్ ఉన్నాయి. ఇవేకాక ఓం రౌత్ దర్శకత్వంలో షూటింగ్ కంప్లీట్ అయిన ఆదిపురుష్ ఈ జూన్ 16న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీగా వుంది. రిలీజ్ కి చాలాకాలం ముందుగానే ఆదిపురుష్ భారీ మొత్తంలో బిసినెస్ జరుపుకోగా..
ఇక నెక్స్ట్ సలార్ కి కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ పోటీ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. సలార్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ నిర్మాణ సంస్థలే పోటీ పడుతున్నాయట. ఇందులో ఆదిపురుష్ రైట్స్ దక్కించుకున్న 14రీల్స్ తో పాటు గీతా ఆర్ట్స్ కూడా ఉన్నాయట. సలార్ కి 600కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా బిసినెస్ జరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. ఆదిపురుష్ హిట్ అయితే సలార్ తో పాటు ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ కి మరింత ప్లస్ అవుతుంది.
ఒక వేళ గీతా ఆర్ట్స్ కు సలార్ మూవీ తెలుగు రైట్స్ దక్కితే మూవీకి మరింత హైప్ వస్తుంది. మూవీని మార్కెట్ చేయడంలో అల్లు అరవింద్ ది అందేవేసిన చేయి. ఎలాగూ అరవింద్ చేతిలో థియేటర్స్ ఉండనే ఉండే.. ఈ నేపథ్యంలో గీతా ఆర్ట్స్ సలార్ కి అదనపు బలం. అయితే ఈ పోటీలో ఎవరు సలార్ రైట్స్ దక్కించుకుంటారో చూడాలి. సలార్ RRR రికార్డులను బ్రేక్ చేసి ఈజీగా 1000కోట్ల క్లబ్ లో చేరుతుందని భావిస్తున్నారు.
కేజీఎఫ్ సిరీస్ ద్వారా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ కాగా, ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో సలార్ కి ఊహించని రేంజ్ లో బిసినెస్ జరిగే ఛాన్స్ ఉంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటించగా.. రవి బసృర్ సంగీతం అందించాడు. భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు.
Discussion about this post