Salaar vs Dunki : సలార్ మరియు డుంకీ ఈ రెండు చిత్రాలను ఒకేరోజు రిలీజ్ చేయడం కోసం ఆ సినిమా మూవీ మేకర్స్ ఆలోచిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే హీరోలు ఒక ఎత్తు అయితే, ఆ చిత్రాలను నిర్మించినటువంటి దర్శకులు మరో ఎత్తు. ఒకవైపు ప్రభాస్, మరోవైపు షారుక్ ఖాన్ ఇద్దరు కూడా ఏ రేంజ్ హీరోలో మనకు తెలుసు.
ఒకవైపు ప్రశాంత్ నీల్, మరోవైపు రాజ్ కుమార్ హిరాని వీళ్లిద్దరూ కూడా దర్శకత్వంలో దూసుకెళ్తున్నటువంటి వ్యక్తులు. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయడం అంటే చాలా గట్స్ అనే చెప్పాలి. ఇప్పుడు ప్రేక్షకులు ఏ సినిమాని హత్తుకుంటారు అనేది కూడా చూడాలి. రాజ్ కుమార్ బాలీవుడ్ లోనే చాలా ప్రముఖమైనటువంటి డైరెక్టర్.
ఈయన చేసిన సినిమాలు తక్కువ అయినప్పటికీ కూడా అందులో అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్, కాసుల వర్షం కురిపించినవే, 2003 నుంచి ఈయన డైరెక్షన్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈయన చేసింది కేవలం ఐదు సినిమాలు. రాజ్ కుమార్ తీసిన సినిమాల్లో హైయెస్ట్ బాక్సాఫీస్ క్రాస్ కలెక్షన్స్ ‘పీకే’ పేరు మీద ఉండగా, ఈ సినిమా 770 కోట్లను వసూలు చేసింది. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి దర్శకుడుగా పరిచయమైన వ్యక్తి ప్రశాంత్ నీల్.
ఈయన కే జి ఎఫ్ సినిమాల ద్వారా పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిపోయారు. 2014లో ‘ఉగ్రం’ అనే సినిమా తీసిన ప్రశాంత్ ఆ తర్వాత కేజిఎఫ్ రెండు చాప్టర్స్ తీసి విజయాన్ని అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ కి సలార్ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఆ డైరెక్టర్ సినిమా అనగానే అందులోనూ ప్రభాస్ హీరో ఉండడంతో సలార్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. మరి ఇప్పుడు ఒకవైపు బాలీవుడ్ మరోవైపు టాలీవుడ్ ఏది ఎక్కువ రేంజ్ లో దూసుకెళ్తుందో చూడాలి.