Samajavaragamana Movie : ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ‘సామజవరగమన’. తమిళ చిత్రాల్లో తన అద్భుతమైన లుక్స్‌తో ఆమె ముద్ర వేసింది రెబా మోనిక. ఆమె దళపతి విజయ్ ‘విజిల్’లో కూడా నటించింది. రెబా మోనిక ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. వివాహా భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న సామజవరగమన. ఫలితం ఎలా ఉన్నా కంటెంట్ ఉన్న కథల ఎంచుకోవడంలోనూ కొత్త తరహాలో ఆ కథలను ప్రేక్షకులకు పరిచయం చేయడంలో శ్రీవిష్ణు ముందు వరుసలో ఉంటాడు.
మొదటి నుండి శ్రీవిష్ణు విభిన్న జానర్లో సినిమాలను చేస్తూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొంత కాలంగా శ్రీవిష్ణు సినిమాలు కమర్షియల్‌గా హిట్లు కాలేకపోతున్నాయి. గతేడాది రిలీజైన ‘అల్లూరి’ కూడా మొదట పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ కమర్షియల్ విజయాన్ని సాధించలేకపోయింది. ప్రస్తుతం శ్రీవిష్ణు ఆశలన్నీ ‘సామజవరగమన’ సినిమాపైనే ఉన్నాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.