Samantha in Salman Khan Movie : ఈమధ్య రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు చాలా మంచి అవకాశాలను దక్కించుకుంటున్నారు. వారిలో ముఖ్యంగా నయనతార, త్రిష. ఇద్దరిలో త్రిష మొదటి ప్లేస్ లో ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఇద్దరితో పాటు మరొక హీరోయిన్ ఫామ్ లోకి వచ్చింది. తనే సమంత. ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ, సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన సమంత,ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అయినట్టు తెలుస్తుంది.
అయితే త్రిషకు, సమంతకి సంబంధం ఏంటి అని అంటే..ఈ ఇద్దరికి సంబంధించి న్యూస్ ఒకటి బాలీవుడ్ లో ఒక హార్ట్ టాపిక్ చర్చ సాగుతుంది. సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు విష్ణువర్ధన్ తో నిర్మాత కరణ్ జోహార్ భారీ ఎత్తున ఒక సినిమాని ప్లాన్ చేశారని విషయం తెలిసిందే. ఆ సినిమాకు “ది బుల్” టైటిల్ ని కూడా ఖరారు చేశారు.
అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరో రెండు రోజుల్లో వస్తుందని సమాచారం. రంజాన్ కు ఈ సినిమాను రిలీజ్ చేయాలని సనాహాలు చేస్తున్నారంట. అయితే ఈ సినిమాలో ముందుగా త్రిష హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఇప్పుడు త్రిష ప్లేస్ లోకి సమంత వచ్చింది. దాని వెనుక రీసన్..
మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న విశ్వంభరకు త్రిష కమిట్మెంట్ ఇచ్చేసింది. దాంతో డేట్స్ సర్ద లేక సల్మాన్ ఖాన్ మూవీని వదులుకోవాల్సి వస్తుంది. త్రిష ఈ విషయంలో చాలా బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ డేట్స్ విషయంలో వచ్చిన ప్రాబ్లం కారణంగానే త్రిష, సల్మాన్ ఖాన్ మూవీ నుంచి తప్పకున్నట్లు తెలుస్తుంది. ఇక త్రిష ప్లేస్ లోకి సమంతను తీసుకుంటున్నారంట.సమంత కూడా ఒకే అన్నట్టుగా తెలుస్తుంది.