Samantha : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గురించి అందరికీ తెలిసిందే. ఓ పక్క గ్లామర్ చిత్రాలతో పాటు లేడి ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తూ దూసుకెళ్తుంది సమంత. ఇటీవల విజయ్ దేవరకొండతో ఖుషి మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకోవడంతో పాటు, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో నటించిన సిటాడేల్ వెబ్ సిరీస్ షూట్ కూడా ఈ మధ్యే కంప్లీట్ అయింది. దీంతో ఈ మధ్యే షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సామ్ మయోసైటీస్ వ్యాధి మళ్లీ తిరగబడడంతో మూవీస్ కి బ్రేక్ ఇచ్చి ట్రీట్ మెంట్ తీసుకుంటుందని భావించారు.
Sai Dharam Tej : మెగా మేనల్లుడిపై మండిపడుతున్న పండితులు..
ఈ క్రమంలో సామ్ తన ఓన్ బ్రాండ్ సాఖీ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సాఖీ బ్రాండ్ న్యూ కలెక్షన్స్ను ప్రమోట్ చేస్తూ ఇన్ స్టాలో కొన్ని పోస్టులు పెట్టింది. దీంతో ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు. ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇవన్నీ ఎందుకు, డబ్బు కోసం నీ బిసినెస్ లను ముందుకు తీసుకెళ్తున్నావా అని మండిపడుతున్నారు. ఇంకొందరేమో సమంత ట్రీట్మెంట్ ఖర్చు లక్షల్లో ఉంటుంది. ప్రస్తుతం ఆమె వద్ద అంత డబ్బు లేదు, అందుకే వాటిని ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాధిస్తుందని కామెంట్ చేస్తున్నారు.
Divi Vadthya Hot Pics : దివి అందాలు అదరహో..