Samantha Shaakuntalam Stills : సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం “శాకుంతలం”. మహాకవి కాళిదాసు రచించిన నాటకం అభిజ్ఞాన శాకుంతలం నాటకం ఆధారంగా ప్రతి ఫ్రేమ్ ఒక విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు గుణశేఖర్. ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ సినిమా..
సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. బుధవారం ఈ సినిమా నుండి “మల్లికా.. మల్లికా..” అనే సాంగ్ ని విడుదల చేసింది చిత్ర బృందం. రమ్య బెహ్రా ఆలపించిన ఈ పాట ఇపుడు సంగీత ప్రియులకు విశేషంగా అలరిస్తుంది. మణిశర్మ అధ్బుతమైన సంగీతానికి రమ్య బెహరా తియ్యటి గాత్రం తోడై పాటను మరింతగా వినేలా చేస్తుంది. .ఇప్పటికే వన్ మిలియన్ వ్యూస్ సాధించిన ఈ సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్ లో టాప్ 10 లో నిలిచింది..ముఖ్యంగా సమంత లుక్ ఐతే బ్యూటిఫుల్ గా ఉంది.. మీరూ ఓ లుక్ వేయండి..