Samantha Siddu Jonnalagadda Movie : హీరోయిన్ సమంతతో లేడి డైరెక్టర్ నందినిరెడ్డికి చక్కటి స్నేహం ఉంది. కష్టసమయాల్లో తనకు అండగా నిలిచిన సన్నిహితుల్లో నందినిరెడ్డి ఒకరు అని సమంత పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో జబర్ధస్త్‌తో పాటు ఓ బేబీ సినిమాలొచ్చాయి. వాటిలో జబర్ధస్థ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టగా ఓ బేబీ మాత్రం కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో సమంత నటనకు ప్రశంసలు దక్కాయి.
అయితే తాజాగా సమంత, నందినిరెడ్డి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ రాబోతున్నట్లు సమాచారం. ఇది పూర్తిస్థాయి కామెడీ చిత్రంగా ఉండనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ.. ఈ న్యూస్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటే.. ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం నందినీ రెడ్డి సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ‘అన్నీ మంచి శకునములే’ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత నిందినీ రెడ్డి తన ఈ ప్రాజెక్ట్పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సమంత విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ షూటింగ్ లో బిజీగా ఉంది. అలాగే సిటాడెల్ తెలుగు వెర్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది.