బాలీవుడ్ నటి కాజల్ నటించిన లేటెస్ట్ మూవీ సర్ జమీన్. ఈ మూవీలో కాజోల్ తనకంటే ఎనిమిదేళ్లు చిన్నవాడైన పృథ్వీరాజ్ సుకుమారన్ కి భార్యగా నటించింది. ఈ మూవీలో పృథ్వీరాజ్ ఆర్మీ అధికారి పాత్రలో నటించారు. సినిమా మొత్తం ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. అసలు కాజల్ పృథ్వీరాజ్ సుకుమారన్ కి భార్యగా నటించడమే ఆడియన్స్ కొత్తగా ఫీల్ అయ్యే అంశం.
ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన ఈ చిత్రం డైరెక్ట్ గా జియో హాట్ స్టార్ ఓటీటీలో జూలై 25న విడుదలైంది. మరి ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది, కథాంశం ఏంటి అనే అంశాలు ఇప్పుడు చూద్దాం. ఈ మూవీ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఉన్నప్పటికీ కథ ఎక్కువగా ఫ్యామిలీ నేపథ్యంలోనే జరుగుతుంది. దేశం కోసం కుటుంబాన్ని సైతం లెక్కచేయకుండా పోరాడే ఆర్మీ అధికారిగా పృథ్వీరాజ్ నటించారు.
కథాంశం ఇదే
కాజల్ పృథ్వీరాజ్ దంపతులకు ఒక కొడుకు ఉంటాడు. అతడిని ధైర్యవంతుడిగా తీర్చిదిద్ది తనలాగే ఆర్మీ అధికారిని చేయాలనేది పృథ్వీరాజ్ కోరిక. కానీ అతడి కొడుకు మాత్రం చిన్నతనం నుంచే భయపడుతూ సరిగ్గా మాట్లాడటం చేతకాని పిల్లాడిగా ఉంటాడు. కొడుకు విషయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు జరుగుతుంటాయి.
Sarzameen
ఊహించని విధంగా ఉగ్రవాదులు పృథ్వీరాజ్ కొడుకుని టార్గెట్ చేసి కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత పృథ్వీరాజ్ కొడుకు ఎలా తిరిగి వచ్చాడు.. తాను కోరుకున్న విధంగా తన కొడుకు ధైర్యవంతుడిగా మారాడా లేదా.. టెర్రరిస్టులను చివరికి ఎలా అంతం చేశారు ఇలాంటి విషయాలు మిగిలిన కథ.
అలాంటివి ఆశిస్తే నిరాశ తప్పదు
ఆర్మీ బ్యాక్ డ్రాప్ అంటే అందరూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆర్మీ ఆపరేషన్స్ , ఉత్కంఠని రేకెత్తించే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు లాంటివి ఆశిస్తారు. కానీ ఈ చిత్రంలో ఆ అంశాలు చాలా తక్కువ. వాటిని ఆశించి సినిమా చూస్తే తప్పనిసరిగా నిరాశ నిరాశ ఎదురవుతుంది.
దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కువగా తండ్రి కొడుకుల సెంటిమెంట్, కొడుకుపై తల్లి చూపించే ప్రేమ లాంటి ఎమోషనల్ సీన్స్ తోనే నడిపించారు. సినిమా మొత్తం ఇదే తరహాలో సాగడంతో ప్రేక్షకులకు బోరింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలను చాలా ఎక్కువగా సాగదీసి ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టారు అని చెప్పాలి. కాజోల్ పృథ్వీరాజ్ భార్యాభర్తలుగా నటించడం అంతగా సెట్ కాలేదు. వీరి కొడుకు పాత్రలో సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ నటించారు. కేవలం కొన్ని ఎమోషనల్ సీన్స్ కోసం మాత్రమే అయితే ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు. అది కూడా ఎక్కువ అంచనాలు లేకుండా.