అవెంజర్ సిరీస్ చిత్రాల నటీమణి స్కార్లెట్ జాన్సన్ కమెడియన్ కోలిన్ జోస్ట్ ను వివాహమాడింది. ప్రపంచంలోనే అత్యధిక పారితోషకం అందుకునే నటి అయిన స్కార్లెట్ ఒక టీవీ షో వ్యాఖ్యాతగా కమెడియన్ అలరించే కోలిన్ జోస్ట్ తో గత మూడు ఏళ్ళుగా డేటింగ్ లో ఉంది. వీరి వివాహం విషయాన్ని మీల్స్ ఆన్ వీల్స్ అనే సంస్ద ధ్రువీకరించింది. వృద్ధులకు సేవలు అందించే ఈ సంస్థకు నిధులను సమకూర్చే ఉద్దేశంతో ఈ సంస్థ ద్వారా ఈ జంట ఒక్కటయ్యారు.