Senior Editor GG Krishna Rao : తారకరత్న ఘటన మరువకముందే..తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం..
తెలుగు సినీ పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.. నందమూరి తారకరత్న విషాదం నుండి ఇంకా తేరుకోని తెలుగు సినీ పరిశ్రమకి ఇది మరో విషాద వార్త..ఎన్నో విజయవంతమైన సినిమాలకి పనిచేసిన ప్రముఖ ఎడిటర్ జీ జీ కృష్ణారావ్ (87) ఈ రోజు కన్ను మూశారు. ఆయన 200 పైచిలుకు చిత్రాలకు ఆయన ఎడిటర్ గా పని చేసారు.
శంకరాభరణం
స్వరాభిషేకం
సిరివెన్నెల
శృతిలయలు
శుభలేఖ
బొబ్బిలిపులి
సర్దార్ పాపారాయుడు
శ్రీ రామ రాజ్యం
ఇలాంటి ఎన్నో ఆణిముత్యల్లాంటి సినిమాకి ఆయన ఎడిటర్ గా తన సేవలు అందించి.. తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. కళా తపస్వి కే. విశ్వనాద్, బాపు, జంధ్యాల, దాసరి వంటి దిగ్గజ దర్శకులతో కృష్ణారావు పనిచేశారు. ట్రెండ్ఆంధ్ర తరపున ఆయనకు ఘన నివాళులు..