Shah Rukh Khan: కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ స్పై యాక్షన్ మూవీ జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానుంది. గత ఆరేడేళ్ళుగా హిట్ అనే మాటకి చాలా దూరంగా ఉంటున్న షారుఖ్ ‘పఠాన్’ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అందుకే పఠాన్ సినిమాని చాలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు.

తాజాగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తన ట్విట్టర్ ఖాతాలో #AskSRK సెషన్‌ను నిర్వహించాడు. దీనిలో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘పఠాన్’ చిత్రం విడుదల నాడు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా థియేటర్ కి వస్తారా? అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా రామ్ చరణ్ నన్ను తీసుకెళ్తే తప్పకుండా వస్తానని సమాధానం ఇచ్చారు. బాలీవుడ్ బడా హీరో.. చరణ్ పేరు ప్రస్తావించడంతో ఆయన అభిమానులు ఖుషీ అయ్యారు.
అయితే వ్యక్తిగతంగా షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ నెల 10న ‘పఠాన్’ తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి బెస్టాఫ్ లక్ చెప్పారు. దీనికి కృతజ్ఞతలు తెలిపిన షారుక్.. ‘మీ ఆర్ఆర్‌ఆర్ టీమ్ ఇండియాకు ఆస్కార్‌ను తీసుకొచ్చినప్పుడు దయచేసి దానిని టచ్ చేయనివ్వండి’ అని అన్నారు. షారుక్ దీన్ని ఇంగ్లిష్‌తో పాటు తెలుగులోనూ ట్వీట్ చేయడం విశేషం.
Yeah if Ram Charan takes me!! https://t.co/LoaE4POU79
— Shah Rukh Khan (@iamsrk) January 21, 2023
