Sharvanan Arul : అరుళ్ శరవణన్ ది లెజెండ్ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా అన్నింటి మీద ట్రోలింగ్ చేశారు. ఎట్టకేలకు ది లెజెండ్.. పాన్ ఇండియా చిత్రం జూలై 28న విడుదలైంది. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బడ్జెట్ ఎక్కువ పెట్టడం వల్ల ఈ మూవీ భారీ నష్టాలను మిగిల్చింది.
శరవణన్ 51 ఏళ్ళ వయసులో హీరోగా చేస్తూ అంత బడ్జెట్ పెడుతున్నాడేంటీ ఇతనేమైనా పిచ్చోడా అంటూ సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేశారు. అయితే శరవణన్ కు నటనపై ఉన్న ఆసక్తి ఆయనని ఒక్క సినిమాతోనే ఆగిపోయేలా చేయలేదు. ఈ క్రమంలోనే మరో సినిమా చేయడానికి సిద్దమయ్యారనీ తెలుస్తోంది.
రెండో మూవీ షూటింగ్ పనులు ఇప్పటికే కాశ్మీర్లో కొంతమేర పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ డీటెయిల్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆయన కాశ్మీర్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సినిమా కోసం శరవణన్ ఏకంగా 50 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ అయినా పాసిటివ్ టాక్ సొంతం చేసుకుంటుందేమో చూడాలి..