రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా గుండెజారి గల్లంతయ్యిందే లాంటి హిట్ చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఒరేయ్ బుజ్జి గా” చిత్రం లాక్‌డౌన్ కి ముందే విడుదలకు సిద్ధమైంది. కానీ అనుకోకుండా లాక్ డౌన్ విధించడం వల్ల విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. రాజ్ తరుణ్ నుండి వచ్చిన గత రెండు చిత్రాలు ఫ్లాప్ అయినా గతేడాది ఖైదీ వంటి హిట్ చిత్రం ఇచ్చిన రాధామోహన్ నిర్మాత కావడంతో బిజినెస్ కి డోకా లేదు అనుకున్నారు. కానీ కరోనా కథ అడ్డం తిరిగేలా చేసింది.
ఎన్నో ఓటీటీ సంస్థలు మొదట్లో ఎక్కువ ఆఫర్ చేసినా ఓటీటీ లో రిలీజ్ కి నిర్మాత ఒప్పుకోలేదు. కానీ ఇప్పట్లో థియేటర్లు తెలిపిన పరిస్థితి లేకపోవడంతో గత్యంతరం లేక ఓటీటీ బాట పట్టారు. ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీన “ఆహా” ఓటీటీ వేదికపై విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో అనూప్ రూబెన్స్ స్వరకల్పనలో సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ మాయ పేరేమిటో అనే ప్రేమ గీతాన్ని ఈరోజు హీరోయిన్ లావణ్య త్రిపాటి విడుదల చేసి చిత్ర యూనిట్ కి అల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేసారు. యూత్ ఫుల్ లవ్ స్టొరీ గా తెరకెక్కిన ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో తెలియాలంటే అక్టోబర్ 2 వరకూ ఆగాల్సిందే.
