Simran Gupta : సిమ్రాన్ గుప్తా ఈ ముంబాయి బ్యూటీ గతంలో ‘తాగితే తందాన’అనే చిత్రంలోనూ నటించింది. సిమ్రాన్ ముంబాయిలోనే పుట్టి పెరిగింది. చదువు పూర్తికాగానే మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. పలు బ్రాండ్స్ ప్రచార చిత్రాల్లోనూ నటించింది. ఈ భామ మంచి డ్యాన్సర్ కూడా. బాలీవుడ్, కాంటెపరరీ, హిప్‌హప్, జాజ్ ఫంక్, క్లాసికల్, సెమీ క్లాసికల్ డ్యాన్స్ రీతుల్లో శిక్షణ తీసుకుంది. జాతీయ స్థాయిలో నిర్వ హించిన అనేక డ్యాన్స్ పోటీల్లో పాల్గొంది. 2014లో డిడీ ఛానల్‌లో ప్రసారమైన ‘భారత్‌కిషాన్ లెట్స్ డ్యా న్స్’ షోలో విజేతగా నిలిచింది. ఛాలెంజింగ్‌గా అనిపించే భిన్నమైన పాత్రలు పోషించాలని ఆకాంక్ష.
ఈ నేపథ్యంలో’ సిమ్రాన్ గుప్తా, విజయ్ ధరణ్ దాట్ల అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘అన్వేషి’ అందరి దృష్టిని ఆకర్షస్తోంది. ఈ చిత్రానికి వీజే ఖన్నా దర్శకత్వం వహిస్తున్నారు. అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై టి.గణపతి రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చగా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. అన్వేషి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో అజయ్ ఘోష్, జబర్దస్త్ నాగి, రచ్చ రవి, ప్రభు, సత్య శ్రీ, సూర్య తేజ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బ్యాగ్రాండ్ స్కోర్, విజువల్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి.