Sir Movie Free Show : తమిళ్ స్టార్ యాక్టర్ ధనుష్ శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తెలుగులో కూడా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటి వరకు డబ్బింగ్ మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ధనుష్ ఫస్ట్ టైం డైరెక్ట్ తెలుగు మూవీ సార్ తో ఇక్కడి ప్రేక్షకులను పలకరించాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రస్తుతం సమాజంలో విద్య వ్యాపార వస్తువుగా మారిందనే పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ మూవీలో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన సార్ సినిమా ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని నిర్మాతలకు, బయ్యర్లకు కనక వర్షం కురిపిస్తుంది.
ఈ నేపథ్యంలో ‘సార్’ సినిమా యూనిట్, ప్రముఖ మల్టిప్లెక్స్ సంస్థ పీవీఆర్‌తో కలిసి ఓ మంచిపని చేసింది. సినిమా మరికొందరికి రీచ్ అయ్యేలా హైదరాబాద్ లోని పలు ప్రభుత్వ పాఠశాలలోని దాదాపు 500 మంది విద్యార్థులకు ధనుష్ సార్ సినిమాని పీవీఆర్ థియేటర్స్‌లో ఉచితంగా చూపించారు.
అంతేకాదు స్టూడెంట్స్ కి పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, బెలూన్స్ కూడా ఫ్రీగా అందించారు చిత్రయూనిట్. సినిమా పూర్తయిన తర్వాత స్టూడెంట్స్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను పీవీఆర్ సంస్థ, చిత్రయూనిట్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ వారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
https://www.instagram.com/reel/CpAExqLAOBA/?igshid=YmMyMTA2M2Y=