Sonu Sood help to Fish Venkat Family: ఫిష్ వెంకట్ మరణం
కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో పాటు ఎన్నో చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. ఫిష్ వెంకట్ కి కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. కిడ్నీలు పాడై పోవడంతో అతడి ఆరోగ్యం విషమించింది.
కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కి 50 లక్షల వరకు డబ్బు అవసరం అయింది. ఫిష్ వెంకట్ కుటుంబం చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆదుకోవాలని రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆశించిన సాయం అందలేదు. దీనితో ఫిష్ వెంకట్ ఆరోగ్యం మరింత క్షీణించి మరణించారు.

ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూసూద్ సాయం
అయితే తాజాగా ప్రముఖ నటుడు, అపర కర్ణుడిగా గుర్తింపు పొందిన సోనూసూద్ ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా నిలిచారు. సోనూ సూద్ ఫిష్ వెంకట్ కుటుంబం కోసం 1.5 లక్షలు డబ్బు సాయం చేశారు. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అవసరమైన సాయం చేస్తానని సోనూసూద్ ప్రకటించడం విశేషం. దీనితో సోనూసూద్ గొప్ప మనసుని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు.
అదే విధంగా విశ్వక్ సేన్ కూడా ఫిష్ వెంకట్ కుటుంబానికి సాయం చేశారు. గబ్బర్ సింగ్ అంత్యాక్షరి గ్యాంగ్ కూడా తమకి తోచిన మొత్తం సాయం అందించారు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ కూడా అండగా నిలబడ్డారు. కానీ ఫిష్ వెంకట్ వైద్యానికి అవసరమైన డబ్బు పూర్తి స్థాయిలో అందలేదు.