Sreeleela about Marriage : జూనియర్ మూవీ రిలీజ్
యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది . శ్రీలీల డాన్సింగ్ క్వీన్ గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ జూనియర్ శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి ఈ చిత్రంలో హీరోగా నటించాడు.

ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో శ్రీలీల చేసిన వైరల్ వయ్యారి సాంగ్ ఎంతలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. లవ్ ఎఫైర్ రొమాన్స్ గురించి ఇంటర్వ్యూలో ప్రశ్నించినప్పుడు శ్రీలీల ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
ప్రేమలో పడే ఛాన్సే లేదు
నేను ప్రేమలో పడటం ఏంటి.. అమ్మ ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అలాంటప్పుడు ప్రేమలో ఎలా పడతాను అని శ్రీలీల తెలిపింది. లేక లేక ఇటీవల మియామీకు వెళితే అక్కడికి కూడా అమ్మ నా వెంట వచ్చింది అంటూ ఫన్నీగా శ్రీలీల తెలిపింది.

నాకు ప్రేమలో పడే అవకాశం లేనప్పటికీ.. నా గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం నా వయసు 23 ఏళ్లు. ప్రస్తుతం కెరీర్ లో బిజీగా ఉన్నాను. 30 ఏళ్ల వరకు పెళ్లి చేసుకునే వీలు ఉండదేమో అని శ్రీలీల తెలిపింది.
