SSMB 28: అల వైకుంఠపురంలో మూవీ లాంగ్ గ్యాప్ తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమా SSMB 28. సూపర్ స్టార్ మహేష్ బాబు.. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు కాగా ఓ క్రూరమైన విలన్ గా సీనియర్ హీరో జగపతిబాబు నటించనున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధకృష్ణ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
SSMB28 మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా. మహేష్ ఇంట్లో జరిగిన వరుస విషాదాలతో ఈ సినిమా షూటింగ్ కొంతకాలంగా వాయిదా పడింది. ఇక రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ కు సిద్ధమవుతోంది.
మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కుతున్న ఈ మూవీ నెక్స్ట్ ఫిబ్రవరి 20 నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్న మహేష్ బాబు 2 రోజుల్లో హైదరాబాద్ రానున్నాడు. దీంతో ఈ మూవీ కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ ఇంటి సెట్టింగ్ వేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ఆగష్టు 11న విడుదల చేయనున్న విషయం తెలిసిందే.