SSMB28 Movie Interesting Update : ఎప్పుడెప్పుడా అని సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్, గురూజీ త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తూ వచ్చిన SSMB 28 సినిమా షూటింగ్ ప్రారంభమైంది. జనవరి నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభిస్తున్నట్టూ చిత్ర యూనిట్ ఇంతకు ముందే అధికారికంగా ప్రకటించారు. దీంతో నేటి నుంచి హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో ఈ మూవీ షూటింగ్ ని ప్రారంభించారు. దీనికోసం స్టూడియోలో భారీ సెట్ ని వేసారు. ఈ నెలాఖరు వరకు అక్కడే షూటింగ్ జరగనున్నట్టు సమాచారం.
మహేష్ సర్కారు వారి పాట హిట్ తర్వాత ఇమ్మిడియట్ గా త్రివిక్రమ్ తో SSMB 28 చెయ్యాల్సి ఉంది. జూన్ లోనే అనుకున్న ఆ మూవీ షూటింగ్ సెప్టెంబర్ కి వెళ్ళింది. సెప్టెంబర్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన మహేష్ కి నెలల గ్యాప్ లో తల్లితండ్రుల మరణంతో ఆ షెడ్యూల్ నిరవధికంగా వాయిదాపడింది. మళ్ళీ జనవరిలో సెకండ్ షెడ్యూల్ మొదలు పెడతామని మేకర్స్ చెప్పినప్పటికీ ఖచ్చితమైన తేదీ ఇవ్వకుండా మహేష్ అభిమానులని డిస్పాయింట్ చేసారు.
Gallery : Actress Kushitha Kallapu Hot Photos
అయితే తాజాగా SSMB28 సెకండ్ షెడ్యూల్ ఈ నెల 18 నుండి అంటే బుధవారం నుండి హైదరాబాద్ లో మొదలు కాబోతుంది. ఆగష్టు 11న SSMB 28 రిలీజ్ డేట్ అంటూ నిర్మాత నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో మహేష్ ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ పూజ హెగ్డే కూడా పాల్గొనబోతుంది. అలాగే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్ కొనుగోలు చేసింది.