SSMB28 Movie Updates : ఎప్పుడెప్పుడా అని సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్, గురూజీ త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తూ వచ్చిన SSMB 28 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేష్ సర్కారు వారి పాట వచ్చి నెలలు గడుస్తుంది, అలాగే అలా వైకుంఠపురంలో తర్వాత నుంచి డైరెక్షన్ చేయలేదు కానీ భీమ్లా నాయక్ లో స్క్రీన్ ప్లే చూసుకున్నాడు. అయితే ప్రస్తుతం SSMB 28 షూటింగ్ మాత్రం గ్యాప్ లేకుండా జరుగుతుంది. ఆగస్టు లో ఈ మూవీ విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు కాగా ఓ క్రూరమైన విలన్ గా సీనియర్ హీరో జగపతిబాబు నటించనున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధకృష్ణ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో కాగా ఇంతకు ముందు వచ్చిన అతడు, ఖలేజా మూవీలో కొత్త ప్రయోగాలు చేసాడు. దీంతో గతంలో వచ్చిన రెండు సినిమాల్లాగే ఈ మూవీ కూడా ప్రయోగాత్మకంగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే SSMB 28 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ ని మార్చ్ 22న ఉగాది సందర్భంగా విడుదల చేయనున్నారు.
ఇక ఈ సినిమాకి ఎన్నడూ లేని విధంగా ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ని కూడా త్రివిక్రమ్ తన స్టైల్ లో ఉండేటట్టు ఇప్పటికే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో మహేష్ అభిమానులు ఈ సినిమా టైటిల్ ఎలా ఉంటుంది అనే దాన్నిబట్టి ఈ సినిమా రిజల్ట్ చెప్పొచ్చని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై అటు మహేష్ అభిమానులు, ఇటు గురూజీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.