మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చి, నటుడిగా కాస్తో కూస్తో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ఈ మధ్యకాలంలో తను చేసే సినిమాల సంఖ్య తగ్గించాడు. సుబ్రమణ్యపురం, ఇదం జగత్ లాంటి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ చిత్రాల తర్వాత కం బ్యాక్ ఫిలింగా తను నటిస్తున్న కపటధారి చిత్రం టీజర్ కాసేపటి క్రితమే రిలీజ్ అయింది. కన్నడలో లాస్ట్ ఇయర్ సూపర్ హిట్ అయిన కవలుదారి మూవీ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కించారు. ఒరిజినల్ వెర్షన్ ని తమిళంలో డైరెక్ట్ చేసిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. టీజర్ చూస్తుంటే పెద్దగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు అనిపిస్తుంది. అవే సీన్ లను మక్కీకి మక్కీ దించేశారు.
ఇక కథ విషయానికొస్తే నగరంలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ పిల్లర్ దగ్గర కొన్ని మృతదేహాల అవశేషాలు దొరుకుతాయి. అవి చాలాకాలం క్రితం పూడ్చి పెట్టబడినవి అనే విషయం వెలుగులోకి వస్తుంది. ట్రాఫిక్ లో పనిచేస్తూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఆసక్తి కలిగిన ఇన్స్పెక్టర్ (గౌతమ్) వాటి వెనుక ఉన్న నిజాలు వెలికి తీయడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే పరిణామాలు ఏంటి.? అసలైన కపటధారి ఎవరు? అనేది చిత్ర కథ.
ఒక విధంగా సుమంత్ ఖాతాలో లేని సస్పెన్స్ తో కూడిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మూవీగా ఈ సినిమా నిలుస్తుంది. క్లిక్ అయితే సుమంత్ కెరియర్ కి మంచి కిక్ ఇచ్చే చిత్రంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా నందిత శ్వేత నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్, జయ ప్రకాష్, వెన్నెల కిషోర్, సంపత్, సుమన్ రంగనాథ్ కీలక పాత్రలు పోషించారు. మేకర్స్ ఈ చిత్రం రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది అనౌన్స్ చేయలేదు. మరి ఓటీటీ రిలీజ్ కి వెళ్తారా లేక థియేటర్ రిలీజ్ కోసం వేచి ఉంటారా అనేది చూడాల్సి వుంది.