Sunil : తెలుగు ఇండస్ట్రీలో సునీల్ పేరును కొత్తగా పరిచయం చేయావల్సిన పనిలేదు. తను స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి తనదంటూ ముద్రను ప్రేక్షకులలో వేసుకున్నాడు. రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్ డైరెక్షన్ లో “మర్యాద రామన్న” సినిమాను చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ తర్వాత “పూలరంగడు” లాంటి సినిమాలతో హీరోగా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ దిశగా వెళ్లాయి. కమెడియన్ గా కెరియర్ మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి తన సినీ ప్రయాణాన్ని డైలామాలో పడేసుకున్నాడు. సునీల్ తర్వాత అటు హీరోగా ఇటు కమెడియన్ గా కూడా అవకాశాలు రాకపోయేసరికి చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని పాత్రలు ఎంచుకొని వాటి ద్వారా మళ్లీ పుంజుకున్నాడు అని చెప్పవచ్చు. దానికి లేటెస్ట్ ఉదాహరణ పుష్ప సినిమాలో తను చేసిన పాత్ర.
అలాగే కొన్ని సినిమాలలో వేరియేషన్స్ ఉన్న పాత్రలను ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును మళ్ళీ తెచ్చుకున్నాడు సునీల్. ఇది ఇలా ఉంటే ఇప్పుడు తను కోలీవుడ్ లో చాలా బిజీ స్టార్ అయిపోయాడు. అక్కడి డైరెక్టర్లు సునీల్ ని కాంటాక్ట్ అయ్యి విపరీతమైన ఆఫర్లు ఇస్తున్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే సునీల్ తన రెమ్యూనరేషన్ కూడా బాగానే పెంచాడని సమాచారం. తెలుగులో రోజుకు 30 వేలు తీసుకుంటున్న సునీల్..తమిళంలో రోజుకు 60 వేల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం.
తెలుగులో కంటే కూడా తమిళంలో సునీల్ కి వరుస అవకాశాలు వస్తున్నాయి. తను నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఆ మూవీలో సునీల్ పాత్రకు మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు. ఆ సినిమాలో సునీల్ పాత్ర నిడివి కూడా ఎక్కువనే.
అలాగే తమిళంలో అటు కమీడియన్ గా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు ఎంచుకొని అక్కడి ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యాడు. శివ కార్తికేయన్ మహావీరన్ సినిమాలో కూడా సునిల్ విలన్ గా నటించి మెప్పించాడు. తాజా మూవీ అయినటువంటి మార్క్ ఆంటోనీ లో కూడా సునీల్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. సునీల్ ఇలా తమిళ ఇండస్ట్రీలో దూసుకుపోవడం నిజంగా ఆనందించాల్సిన విషయమే.