Super Dedication for Ram Charan Game Changer Movie : ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్, మరోసారి ప్రేక్షకులను ఆలరించడానికి “గేమ్ ఛేంజర్” తో మన ముందుకు వస్తున్నాడు. ఆడియన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత వచ్చే సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయని చెప్పవచ్చు.
అయితే ప్రేక్షకుల అంచనాను వమ్ము చేయకుండా రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ చేంజర్ సినిమాని ప్రేక్షకులకు కానుకగా ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లి షూటింగ్ కూడా జరిగింది. సకాలంలో షూటింగ్ జరిగితే ఇప్పటివరకు పూర్తయ్యేది. కానీ కొన్ని కారణాలవల్ల షూట్ పూర్తి కాలేదు.
ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు మూవీ మేకర్స్. తాజాగా రామ్ చరణ్ ఒక మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ కామెంట్స్ నెటింట్లో వైరల్ అవుతున్నాయి. గత వారం రోజులుగా గేమ్ చేంజర్ సినిమా కోసం 16 గంటల పాటు వర్క్ చేయాల్సి వచ్చిందని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా సెట్స్ లో ఫర్ఫెక్ట్ సమయానికి వెళ్ళేందుకు తాను ఇష్టపడతానని చరణ్ అన్నాడు.
చరణ్ మాటలు విన్న ఫ్యాన్స్ చరణ్ డేడికేషన్ ని చాలా మెచ్చుకుంటున్నారు. కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం చరణ్ ది అని వాళ్ళు గొప్పగా కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, హీరోయిన్ గా అందాల భామ కియారా అద్వానీ నటిస్తుంది.