పలాస లాంటి రా మెటీరియలిస్టిక్ మాస్ మూవీ తీసిన కరుణ్ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్ మోషన్ పోస్టర్ ఈ రోజు రిలీజ్ అయింది. 80 లలో వాడే హ్యాండ్ మేడ్ సైన్ బోర్డు, అందులో శ్రీదేవి బొమ్మ, బోర్డు పైన భుజానికి రంగు కాగితాలు చుట్టిన చిన్న బల్బుల సెట్ తో చేతిలో సోడా కాయతో ఇన్ అండ్ అవుట్ ఉరు మాస్ లుక్ లో సూరిబాబుగా సుదీర్ బాబు లుక్ డిజైన్ చేశారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లుక్ కి తగిన విధంగా ఉంది. గతంలో సుదీర్ బాబు తో భలే మంచి రోజు సినిమా నిర్మించిన 70 MM ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.